టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్ టాక్‌ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్‌లో నటించింది విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని.
నిర్మాతగా హిట్ సినిమాలు!
యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.
నటన పై ఇష్టంతో..
నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్‌కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్‌లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.


