
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి తేజ్ సజ్జా 'మిరాయ్', బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కంధపురి' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండింటిపైన కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి. అలానే ఓటీటీల్లోనూ తక్కువ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిలో కొన్ని చూడదగ్గ హిట్ చిత్రాలు ఉండటం విశేషం.
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ 'కూలీ', హిట్ బొమ్మ 'సు ఫ్రమ్ సో' ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'సయారా' కూడా ఇదే వారం రాబోతుందని సమాచారం. ఈ మూడు కచ్చితంగా చూడదగ్గ మూవీస్. అలానే బకాసుర రెస్టారెంట్, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలతో పాటు డు యూ వాన్నా పార్ట్‌నర్, రాంబో ఇన్ లవ్ తదితర సిరీస్‌లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 8 నుంచి 14 వరకు)
అమెజాన్ ప్రైమ్
హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10
ద గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10
వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) - సెప్టెంబరు 10
కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 11
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 12
ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 12
ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12
నెట్‌ఫ్లిక్స్
డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 08
సయారా (హిందీ సినిమా) - సెప‍్టెంబరు 12 (రూమర్ డేట్)
హాట్‌స్టార్
సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 09
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 09
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 12
సన్ నెక్స్ట్
మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12
బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12
లయన్స్ గేట్ ప్లే
డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12
ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12