breaking news
Su From So Movie
-
'సు ఫ్రమ్ సో' నటి.. మనసుని కదిలించే షార్ట్ ఫిల్మ్
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా 'సు ఫ్రమ్ సో'. ఇందులో భాను అనే పాత్రలో నటించిన సంధ్య ఆకట్టుకుంది. అయితే ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఓ షార్ట్ ఫిల్మ్‌లోనూ లీడ్ రోల్ చేసింది. అదే 'హిండె గాలి ముందే మత్తె'. దాదాపు ఎనిమిదికిపైగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు దీన్ని కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టికి చెందిన లైటర్ బుద్దా ఫిల్మ్స్ తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: షూటింగ్లో ఎన్టీఆర్‌కు ప్రమాదం)షార్ట్ ఫిల్మ్ విషయానికొస్తే.. బెంగళూరులోని ఓ అద్దె ఇంట్లో భార్యభర్త జీవిస్తుంటారు. భర్త ఓ మెషీన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. అయితే వస్తున్న జీతం సరిపోవట్లేదని భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయిస్తాడు. నాలుగోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే భర్తకు చెప్పకుండా భార్య విషయం దాస్తుంది. దీని గురించి భర్తకు ఎలా తెలిసింది? చివరకు భార్య ఏం చేసింది అనేదే స్టోరీ.దాదాపు అరగంటపాటు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్.. మధ్య తరగతి ఉద్యోగి జీవితాన్ని, భర్తకు ఎదురుచెప్పని ఓ భార్య జీవితాన్ని, పిల్లల్ని కనాలనే ఆశ ఉన్నా సరే పెంచలేం ఏమో అని భయపడి మదనపడే ఓ జంట భావోద్వేగాల్ని చక్కగా చూపించారు. కన్నడలో ఆడియో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతారు. అలానే సిటీల్లో ఉండే చాలామంది జంటలు దీనికి కనెక్ట్ అవ్వొచ్చు కూడా.(ఇదీ చదవండి: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం) -
ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి తేజ్ సజ్జా 'మిరాయ్', బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కంధపురి' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండింటిపైన కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి. అలానే ఓటీటీల్లోనూ తక్కువ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిలో కొన్ని చూడదగ్గ హిట్ చిత్రాలు ఉండటం విశేషం.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ 'కూలీ', హిట్ బొమ్మ 'సు ఫ్రమ్ సో' ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'సయారా' కూడా ఇదే వారం రాబోతుందని సమాచారం. ఈ మూడు కచ్చితంగా చూడదగ్గ మూవీస్. అలానే బకాసుర రెస్టారెంట్, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలతో పాటు డు యూ వాన్నా పార్ట్నర్, రాంబో ఇన్ లవ్ తదితర సిరీస్‌లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 8 నుంచి 14 వరకు)అమెజాన్ ప్రైమ్హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10ద గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) - సెప్టెంబరు 10కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 11డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12నెట్ఫ్లిక్స్డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 08సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12 (రూమర్ డేట్)హాట్స్టార్సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 09ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 09రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్స్ట్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12


