
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా 'సు ఫ్రమ్ సో'. ఇందులో భాను అనే పాత్రలో నటించిన సంధ్య ఆకట్టుకుంది. అయితే ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఓ షార్ట్ ఫిల్మ్‌లోనూ లీడ్ రోల్ చేసింది. అదే 'హిండె గాలి ముందే మత్తె'. దాదాపు ఎనిమిదికిపైగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు దీన్ని కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టికి చెందిన లైటర్ బుద్దా ఫిల్మ్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు ప్రమాదం)
షార్ట్ ఫిల్మ్ విషయానికొస్తే.. బెంగళూరులోని ఓ అద్దె ఇంట్లో భార్యభర్త జీవిస్తుంటారు. భర్త ఓ మెషీన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. అయితే వస్తున్న జీతం సరిపోవట్లేదని భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయిస్తాడు. నాలుగోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే భర్తకు చెప్పకుండా భార్య విషయం దాస్తుంది. దీని గురించి భర్తకు ఎలా తెలిసింది? చివరకు భార్య ఏం చేసింది అనేదే స్టోరీ.
దాదాపు అరగంటపాటు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్.. మధ్య తరగతి ఉద్యోగి జీవితాన్ని, భర్తకు ఎదురుచెప్పని ఓ భార్య జీవితాన్ని, పిల్లల్ని కనాలనే ఆశ ఉన్నా సరే పెంచలేం ఏమో అని భయపడి మదనపడే ఓ జంట భావోద్వేగాల్ని చక్కగా చూపించారు. కన్నడలో ఆడియో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతారు. అలానే సిటీల్లో ఉండే చాలామంది జంటలు దీనికి కనెక్ట్ అవ్వొచ్చు కూడా.
(ఇదీ చదవండి: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం)