
జూ.ఎన్టీఆర్ గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే జిమ్‌లో తారక్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఓ ప్రమాదం జరగ్గా.. తారక్‌కి స్వల్ప గాయాలయ్యాయి.
(ఇదీ చదవండి: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం)
స్టేజీపై ఓ చివరన నిలబడి ఉండగా అనుకోకుండా ఎన్టీఆర్ కింద పడ్డాడని దీంతో ఊపిరితిత్తులు, చేయి మధ్య భాగాన కాస్త అసంతృప్తికి గురయ్యారని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒకటి రెండు వారాల పాటు విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు ఎన్టీఆర్ టీమ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తారక్ ఇంట్లోనే ఉన్నారని, అభిమానులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొది.

గతేడాది 'దేవర'తో వచ్చిన తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్‌తో భారీ మైథలాజికల్ మూవీ ఉండనుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?)
