శర్వానంద్‌ దంపతులు విడిపోయారా..? | Sharwanand Separate With His Wife Rakshitha News Spread Social Media | Sakshi
Sakshi News home page

శర్వానంద్‌ దంపతులు విడిపోయారా..?

Sep 19 2025 10:53 AM | Updated on Sep 19 2025 11:13 AM

Sharwanand Separate With His Wife Rakshitha News Spread Social Media

టాలీవుడ్‌లో సడెన్‌గా ఒక వార్త వైరల్‌ అవుతుంది. అందులో నిజం ఎంతమాత్రం ఉందో తెలియదు కానీ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుండటం విశేషం. ప్రముఖ హీరో శర్వానంద్ (Sharwanand) దంపతుల మధ్య విబేధాలు వచ్చాయని, దీంతో కొంత కాలంగా వారిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారని వైరల్‌ అవుతుంది. 2023లో  రక్షిత అనే యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితమే  పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట గురించి సడెన్‌గా ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే, ప్రస్తుతం వారిద్దరూ వేరుగా ఉంటున్నారనే మాట నిజమేనని తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని జైపుర్‌లో నటుడు శర్వానంద్‌- రక్షిత వివాహం 2023లో ఘనంగా జరిగింది. ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుంది. అయితే, వారిద్దరూ పూర్తి అంగీకారంతోనే విడాకులు తీసుకోకుండా వేరు వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ ఎవరింట్లో వారు ఉంటున్నారట. పాప మాత్రం శర్వానంద్‌ దగ్గర కొద్దిరోజులు తల్లి రక్షిత వద్ద కొన్నిరోజులు ఉంటుందట. ఈ దంపతుల విషయం గురించి సోషల్‌మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. కానీ, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందనేది ఎవరికీ తెలియదు. బహుషా శర్వా స్పందించి ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ఛాన్స్‌ ఉంది.

2022లో ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్‌ పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన మనమే అనే చిత్రంలో మాత్రమే నటించారు. తర్వాత భోగి అనే సినిమా ఒప్పుకున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ సినిమా షూటింగ్‌ విషయాలు ఇంకా తెరపైకి పెద్దగా రాలేదు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement