
సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్‌లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్‌ఫుల్‌గానే ఉంది.
(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్‌పై చాలా కోపం.. నన్ను వేస్ట్ చేశాడు: సంజయ్ దత్)
ఈ పాటని వైజాగ్ పోర్ట్‌లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న 'కూలీ'లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)