
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. అన్ని భాషల సినిమాలు థియేటర్లకు వెళ్లి చూడలేం కాబట్టి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అందుకు తగ్గట్లు ఓటీటీ సంస్థలు కూడా హాలీవుడ్‌తోపాటు విదేశీ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్ని మన ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హాలీవుడ్‌లో తీసిన కరాటే మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?
(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)
చైనీస్ నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. 2010లో 'కరాటే కిడ్' అనే మూవీ చేశాడు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తోనే తీసిన మూవీ 'కరాటే కిడ్: లెజెండ్స్'. మే 30న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమా విషయానికొస్తే.. ఓ చైనీస్ కుర్రాడు తల్లితో కలిసి అమెరికా వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కంగ్ ఫూని కూడా పక్కనబెట్టేస్తాడు. అయితే కాలేజీలో ఓ ఆకతాయి కుర్రాడు.. ఇతడిని ఇబ్బంది పెడతాడు. దీంతో ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో మళ్లీ కంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడంతో పాటు కరాటే నేర్చుకుంటాడు. మరి చివరకు ఏమైంది? ఆకతాయికి చైనీస్ కుర్రాడు కరాటేతో సమాధానమిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)