
రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం)
విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.
'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్‌ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్.
ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు)
