విశాఖలో 'అల్లు అర్జున్‌' మల్టీఫ్లెక్స్‌ పనులకు శ్రీకారం | AAA Cinemas Pooja Ceremony At Inorbit Mall Visakhapatnam, Interesting Deets Inside| Sakshi
Sakshi News home page

విశాఖలో 'అల్లు అర్జున్‌' మల్టీఫ్లెక్స్‌ పనులకు శ్రీకారం

Jul 11 2025 8:59 AM | Updated on Jul 11 2025 9:41 AM

AAA Cinemas Pooja In Inorbit Mall Visakhapatnam

విశాఖపట్నంలోని ఇనార్బిట్‌ మాల్‌ కొద్దిరోజుల్లో ఓపెన్కానుంది. విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా అడుగులు వేస్తోంది. క్రమంలోనే ఇనార్బిట్ మాల్లో ఆసియన్ అల్లు అర్జున్ (AAA) మల్టీ ప్లెక్స్ పనులు తాజాగా ప్రారంభించారు. 2023లోనే  13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి పునాది పడింది. దక్షిణాదిలోనే విశాఖలో నిర్మించే మాల్‌ అతిపెద్దది.

జులై 10 ఆసియన్ సునీల్, అల్లు అరవింద్లతో పాటు వారి టీమ్విశాఖపట్నం చేరుకుంది. ఇనార్బిట్‌ మాల్‌లో (AAA) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తికావాలని ప్రణాళికలు వేశారు. ఇప్పటికే థియేటర్లో ఉండాల్సిన ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్ఫైనల్చేశారట. మల్టీ ప్లెక్స్కు కావాల్సిన ఫర్నీచర్అంతా విదేశాల నుంచే తెప్పిస్తున్నారు

విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్గా (AAA) ఉండాలని వారు ప్లాన్చేస్తున్నారు. మొత్తం 8 స్క్రీన్స్‌  ఈ మల్టీఫ్లెక్స్‌ నందు ఉంటాయి. 2026 సమ్మర్‌లో ప్రారంభం కానుందని ప్రకటించారు.  ఇప్పటికే హైదరాబాద్లోని కూకట్పల్లిలో అల్లు అర్జున్కు ఒక మల్టీఫ్లెక్స్ఉన్న విషయం తెలిసిందే. త్వరలో కోకాపేట వద్ద మరోకటి కూడా వారు నిర్మించే ప్లాన్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement