breaking news
karate kid
-
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. అన్ని భాషల సినిమాలు థియేటర్లకు వెళ్లి చూడలేం కాబట్టి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అందుకు తగ్గట్లు ఓటీటీ సంస్థలు కూడా హాలీవుడ్‌తోపాటు విదేశీ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్ని మన ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హాలీవుడ్లో తీసిన కరాటే మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)చైనీస్ నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. 2010లో 'కరాటే కిడ్' అనే మూవీ చేశాడు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తోనే తీసిన మూవీ 'కరాటే కిడ్: లెజెండ్స్'. మే 30న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా విషయానికొస్తే.. ఓ చైనీస్ కుర్రాడు తల్లితో కలిసి అమెరికా వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కంగ్ ఫూని కూడా పక్కనబెట్టేస్తాడు. అయితే కాలేజీలో ఓ ఆకతాయి కుర్రాడు.. ఇతడిని ఇబ్బంది పెడతాడు. దీంతో ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో మళ్లీ కంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడంతో పాటు కరాటే నేర్చుకుంటాడు. మరి చివరకు ఏమైంది? ఆకతాయికి చైనీస్ కుర్రాడు కరాటేతో సమాధానమిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
బాలీవుడ్ సినిమాలో జాకీ చాన్?
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన కరాటే కిడ్ ఫ్రాంచైజ్ మరోసారి తెరపైకి రానుంది. మే 30న విడుదల కానున్న కరాటే కిడ్: లెజెండ్స్ చిత్రంలో లెజెండరీ యాక్షన్ హీరో జాకీ చాన్ మిస్టర్ హాన్గా తిరిగి కనిపించనున్నారు. ఈ సినిమాలో బెన్ వాంగ్ హీరోగా నటిస్తుండగా, రాల్ఫ్ మాకియో డేనియల్ లారూసో పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాకు హిందీ డబ్బింగ్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు గొంతు ఇవ్వగా, అతని కుమారుడు యుగ్ దేవగణ్ బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు వాయిస్ ఓవర్‌తో సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. తండ్రి-కొడుకు ఇద్దరూ ఒకే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి, ఇది బాలీవుడ్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది.తాజాగా జాకీ చాన్, బెన్ వాంగ్‌తో కలిసి అజయ్ – యుగ్ దేవగణ్ ఆన్లైన్ లో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్.. తన తండ్రి వీరు దేవగణ్ గురించీ, జాకీ చాన్ గురువు మిస్టర్ మియాగీగురించి మాట్లాడారు. యుగ్ దేవగణ్ తన తండ్రి లేనిదే నేను లేను అని చెప్పాడు. అలాగే అజయ్.. ఇప్పుడు యాక్షన్ సీన్స్ చాలా ఈజీ. మునుపటిలా కేబుల్స్ వాడి గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది. కానీ హార్డ్ వర్క్‌కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు అని తెలిపారు. అలాగే బాలీవుడ్లో ఓ చిత్రం చేయాలని జాకీ చాన్ అన్నారు.“నీవు ఫైట్ చేస్తావు, నేను డ్యాన్స్ చేస్తా” అని అజయ్‌తో జోక్ చేస్తూ, భవిష్యత్తులో బాలీవుడ్లో కలిసి పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
రింగ్‌లో దిగనున్న 'కరాటే కిడ్: లెజెండ్స్'.. ఎప్పుడంటే
హాలీవుడ్ చిత్రాలకు భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి, ఆదరణ ఉంటుంది. అలా ఇంతకుముందు వచ్చిన కరాటే కిడ్ 5 ఫ్రాంచైజ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆలరించాయి. తాజాగా ఆ కోవలో వస్తున్న చిత్రం కరాటే కిడ్: లెజెండ్స్. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో డేనియల్ లారుస్సోగా ప్రధాన పాత్రను పోషించిన రాల్ఫ్ మాచియో తన భావాలను పంచుకుంటూ కరాటే కిడ్: లెజెండ్స్ చిత్రంలో మరోసారి లారుస్సో పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో జాకీచాన్, మిస్టర్ హాన్లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఒక నటుడుగా, ఎంటర్టైనర్గా జాకీచాన్ పట్ల తనకు ఎంతో గౌరవం అన్నారు. ఈ రంగంలో ఆయన ఒక లెజెండ్ అని, చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్, కామెడీ సన్నివేశాల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. అదే విధంగా మిస్టర్ మియాగి అంటే కూడా తనకు చాలా గౌరవం అని రాల్ఫ్ మాచియో చెప్పారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్ ,తమిళం, తెలుగు భాషల్లో మే 30వ తేదీన తెరపైకి రానుంది. -
‘కరాటే కిడ్: లెజెండ్స్’ ట్రైలర్ విడుదల
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ తన కుమారుడు యుగ్ దేవ్గన్తో కలిసి ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది తొలిసారి తండ్రీ-కొడుకులు కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో పని చేయడం కావడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ హాలీవుడ్ లెజెండ్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు హిందీలో తన గొంతునిచ్చారు. ఇది అజయ్ దేవ్‌గన్‌కు అంతర్జాతీయ సినిమా డబ్బింగ్లో తొలి అడుగు కావడం విశేషం. అదే సమయంలో, యుగ్ దేవ్గన్ కథానాయకుడు లీ ఫాంగ్ (బెన్ వాంగ్ నటించిన పాత్ర) పాత్రకు డబ్బింగ్ చేస్తూ బాలీవుడ్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించారు. యుగ్‌లోని యువ శక్తి మరియు గొంతులోని శక్తివంతమైన టోన్ ఈ పాత్రకు కొత్త జీవం పోస్తున్నాయి.నిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్‌కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. -
'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం
హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన 'కరాటే కిడ్: లెజెండ్స్' ఇప్పుడు సరికొత్తగా భారతీయ ప్రేక్షకులని పలకరించబోతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, కొడుకు యుగ్ కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం పనిచేశారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) జాకీ చాన్ మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగన్ గొంతు అందించగా, బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు. తొలిసారి ఇంటర్నేషనల్ సినిమాకు వాయిస్ ఇవ్వడం అజయ్ దేవగన్‌కి ఇదే తొలిసారి.సినిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్‌కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఇండియాలో అత్యంత ప్రాచుర్య పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్: లెజెండ్స్(Karate Kid: Legendత) కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్లో ఆ పాత్ర కు వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్లో చూశారు.ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్ నగరానికి వచ్చి ఓ ప్రసిద్ధ పాఠశాలలో చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్ కరాటే చాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లీ ఫాంగ్ కుంగ్ ఫూ గురువు మిస్టర్ హాన్ మరియు లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరి శైలి మిళితంతో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ పోరుకు సిద్ధమవుతాడు. ఈ ఏపిసోడ్ అందర్ని ఎంతో అలరించే విధంగా ఉంటుంది. జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మరియు మింగ్-నా వెన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్
‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు మేం భయపడ్డాం. శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలిసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు కరాటే నేర్పించాలి.’ – కరాటే విజేతలు అగనంపూడి(గాజువాక): ఆత్మస్థైర్యం, స్వీయరక్షణతోపాటు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు బాలికలు కరాటేను ఎంచుకుని.. నిరంతర సాధన చేశారు. చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందుతూ.. సరిలేరు మాకెవ్వరూ అంటూ పతకాలు పంట పండిస్తున్నారు. వీరే కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్‌నగర్ ప్రాంతాలకు చెందిన బాలికలు. వేపగుంటకు చెందిన చాంపియన్స్ కరాటే డోజో సారథ్యంలో జాతీయ కోచ్, బ్లాక్ బెల్ట్ ఫిప్త్ డాన్, జపాన్ కరాటే షోటోకై వి.ఎన్.డి.ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షణలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. వీరికి గంటా కనకారావు మెమోరియల్ సంస్థ సాయం అందిస్తోంది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంటున్న మృదుల, హీరో సుమన్ నుంచి పసిడి పతకం అందుకుంటున్న రేష్మా వండర్ కిడ్..రేష్మా చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో తన పంచ్‌లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వండర్ కిడ్.. పసిడి పతకాల పంట పండిస్తోంది పేడాడ రేష్మా. కూర్మన్నపాలెం సమీపంలోని మాతృశ్రీ లే అవుట్లో నివాసముంటున్న రేష్మా ఉక్కునగరంలోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2019 నుంచి కరాటేలో శిక్షణ పొందుతోంది. ఇప్పటి వరకు రేష్మా తన పంచ్‌లతో రాష్ట్ర, జాతీయస్థాయిలో 8 బంగారు, 7 రజత, రెండు కాంస్య పతకాలు సాధించి ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తండ్రి పి.వరహాలరావు ఇండియన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి. తల్లి ధనలక్ష్మి గృహిణి. అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు కోచ్‌లు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. చదవండి👉🏾 మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత మృదుల.. పతకాల వరద దువ్వాడ విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.మృదుల కరాటేలో 2018 నుంచి శిక్షణ పొందుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తి పెంచుకున్న మృదుల ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 26 పసిడి పతకాలు, 6 రజతం, 7 కాంస్య పతకాలు సాధించి.. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు తన పవర్ చూపించింది. తండ్రి ఎం.సుధాకర్ ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తుండగా.. తల్లి పద్మజ గృహిణి. మృదులను ఆది నుంచి ప్రోత్సహిస్తుండడంతో మెరుపు పంచ్‌లతో పతకాల వేట సాగిస్తోంది. కరాటేలో ప్రపంచ చాంపియన్‌గా నిలవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. జాతీయ కోచ్ చేతుల మీదుగా పసిడి పతకం అందుకుంటున్న లిఖిత చరిత్రలో ఓ పేజీ లిఖించుకుంది నేటి సమాజంలో బాలికలు, మహిళల ఆత్మ రక్షణకు కరాటే ఒక ఆయుధం అని భావించే టి.లిఖిత ఎన్ఏడీ కొత్తరోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే కరాటేలో రాణిస్తోంది. చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని పంచ్ విసిరితే పతకం వచ్చి తీరాల్సిందే. లిఖిత ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 33 బంగారు పతకాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు తన ఖాతాలో జమచేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నది ఆమె లక్ష్యం. ఆమె తండ్రి వెంకట మహేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి గృహిణి. వీరిద్దరితోపాటు కోచ్‌లు కూడా తనకు ఆది నుంచి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని లిఖిత తెలిపింది. చదవండి👉 బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన సాయి కీర్తనకు పతకం అందిస్తున్న నిర్వాహకులు ‘కీర్తి’ ప్రతిష్టలు పెంచేలా.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సీహెచ్ వేద సాయి కీర్తన.. కుటుంబంతో నిర్వాసితకాలనీలో నివాసం ఉంటోంది. 2018 నుంచి డోజో ఇన్స్టిట్యూట్లో కరాటే శిక్షణ కొనసాగిస్తోంది. సమాజంలో మహిళలు పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఎదుర్కొడానికి కరాటే ఒక్కటే శరణ్యమని భావించి.. దానిపై ఇష్టం పెంచుకుంది. స్వీయ రక్షణతో పాటు కరాటేలో ఉత్తమ ప్రదర్శనతో విశ్వవిఖ్యాతగా నిలవాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పటి వరకు 15 బంగారు, మూడు రజతం, 9 కాంస్య పతకాలతో మెరుపులు మెరిపించింది. తండ్రి సీహెచ్.రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి అర్చనా దేవి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ -
కరాటే కిడ్ టు కెప్టెన్
జూన్ 21న బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తుది జట్టులో రహానే స్థానం కోల్పోయాడు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఏకంగా భారత జట్టు కెప్టెన్‌గా మారిపోయాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ముంబై నుంచి కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. వివాదాలకు దూరంగా తన పనేదో చేసుకుంటూ వెళ్లే రహానే.. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడు. కొత్త వ్యక్తులతో అంత త్వరగా కలసిపోలేని రహానే భారత కెప్టెన్‌గా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.. బంగ్లాదేశ్‌తో వన్డేలో అజింక్య రహానేను జట్టులోకి తీసుకోకపోవడంతో అతనికి గాయం అయ్యిండొచ్చని అందరూ భావించారు. అయితే కావాలనే తప్పించారనే విషయం తెలియగానే షాకవడం అభిమానుల వంతైంది. అయినా రహానే టాలెంట్ అతణ్ని నిలబెట్టింది. వారం తిరగకముందే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా మారాడు. దీంతో సెలక్టర్లు అతనిపై ఉంచిన నమ్మకమేంటో మనకు అర్థమవుతోంది. కోహ్లికి వారసుడిగా రహానేను ఇప్పటినుంచే తయారుచేయాలని భావిస్తున్నారు. ఎవరిని ఒక్క మాట కూడా అనలేని రహానే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలడా అని కొందరు అంటున్నా అవసరమోచ్చినప్పుడు తన అభిప్రాయాలను చెప్పడంలో మోహమాటపడడు అని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. తండ్రి భయం.. రహానే కుటుంబం ముంబై మెట్రోపాలిటన్‌లో ఒక మూలన ఉన్న డొంబ్లివాలీలో నివాసం ఉండేది. చిన్నప్పుడు రహానే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇలా ఉంటే అందరూ ఏడిపిస్తారనే భయంతో రహానే తండ్రి అతణ్ని కరాటే స్కూల్లో చేర్చాడు. 9 ఏళ్ల వయసులో కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టిన రహానే.. మెల్లగా రాటుదేలాడు. అతని జీవితంలో అన్ని సవాళ్లకు ఎదురు నిలబడి పోరాడడంలో, దృఢంగా మారడంలో ఆ శిక్షణ ఎంతో ఉపయోగపడింది. కరాటే స్కూల్లో కూడా మృదుస్వభావిగానే ఉన్నా ప్రత్యర్థిపై అటాక్ చేసే విషయంలో మాత్రం ఎలాంటి వెనకడుగు వేసేవాడు కాదు. ప్రస్తుతం బౌలర్లపై విరుచుకుపడుతున్నట్లు. రిజర్వ్‌గా ఉండడం వల్ల చెప్పిన పనిని చాలా ఏకాగ్రతతో చేసేవాడు. కరాటేతో అతడు దృఢంగా తయారవడంతో తన కంటే పెద్ద వారితో క్రికెట్లో పోటీ పడడానికి భయపడేవాడు కాదు. సచిన్, కాంబ్లీలతో ఆడాలని.. తన వీధిలో క్రికెట్ స్టార్‌గా మారిన రహానేను అతని తండ్రి.. డొంబ్లివాలీలోని ఒక క్రికెట్ క్యాంప్‌లో చేర్చాడు. అక్కడి ట్రైనర్ రెండు ఫొటోలని రహానేకు చూపించి వారిని గుర్తించమని అడగగా, వాటిల్లోని వ్యక్తుల పేర్లు చెప్పడమే కాకుండా వారితో ఆడాలని ఉందనే కోరికను బయట పెట్టాడు. ఆ వ్యక్తులు సచిన్, వినోద్ కాంబ్లీ. తర్వాతి కాలంలో భారత జట్టులో సచిన్‌తో కలసి రహానే ఆడాడు. జిల్లా స్థాయిలో తన జట్టుకు నాయకత్వం వహించిన రహానే.. ఒక వన్డే మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. తర్వాత ముంబై నగరంలోని కొన్ని క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. కేవలం క్రికెట్ ఆడటానికి రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు. రహానే కోసం అతని కుటుంబం ముంబై నగరానికి దగ్గరగా ఉండే ఏరియాకు మారింది. 2013 తర్వాత అసలు ప్రదర్శన.. 2007లో భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రహానే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెండు సెంచరీలు బాదాడు. ముంబై జట్టులో చోటు సంపాదించి అద్భుత ప్రదర్శనతో 2011లోనే భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అతి జాగ్రత్తగా ఆడడంతో పరుగులు చేయలేక ఇబ్బందిపడి జట్టులో చోటు కోల్పోయాడు. 2010 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా ఐపీఎల్లో మెరిసింది తక్కువే. అయితే 2012లో రాజస్తాన్ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. దాంతో మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఈ సారి ఇక వెనుదిరగలేదు. టెస్టు, వన్డే, టీ20లనే తేడా లేకుండా అదరగొడుతున్నాడు. కెప్టెన్‌గా అనుభవం తక్కువే.. రహానే రంజీల్లో ముంబై తరఫున ఆడేవాడు. కెప్టెన్‌గా అనుభవం చాలా తక్కువ. ముంబై జట్టుకు ఒక లిస్ట్-ఎ మ్యాచ్, ఒక టీ20 మ్యాచ్‌లకు మాత్రమే సారథిగా వ్యవహరించాడు. అయితే అండర్-19 లెవల్లో 2005-06 కూచ్ బెహార్ టోర్నీలో తన జట్టును విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో ఏకంగా 762 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. రహానే సమర్థుడు: సచిన్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రహానేను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పొగడ్తలతో ముంచెత్తాడు. కెప్టెన్ పదవిని సమర్థంగా నిర్వహించగలడని తెలిపా డు. ‘‘అజింక్య కెప్టెన్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అతడు నిజాయితీ పరుడు. చాలా కష్టపడతాడు. అతని అంకితభావం చూసి ముగ్ధుడినయ్యాను. రహానే ఎప్పుడూ పూర్తి సామర్థ్యంతో ఆడతాడు. అతనికి నా శుభాకాంక్షలు’’అని అన్నాడు. 2000 లో సచిన్ కెప్టెన్సీ వదులుకున్నాక మళ్లీ భారత జట్టుకు కెప్టెన్ ఎంపికైన ముంబై ఆటగాడు రహానేనే. మరికొన్ని.. రహానే ఓపెనింగ్ పొజిషన్లో ఆడేవాడు. అయితే రోహిత్ శర్మ ఆ స్థానంలో కుదురుకోవడంతో మిడిలార్డర్‌కు మారాడు. ఆటను మెరుగుపరచుకుంటూ గత 18 నెలలుగా భారత జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారీ హిట్టర్ కాకపోయినా టీ20ల్లో కూడా స్టార్‌గా ఎదిగాడు. టైమింగ్ షాట్లతో క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకున్నాడు. రహానేకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. ముంబై మెట్రోపాలిటన్‌లోని ములుంద్ ప్రాంతంలో భార్య రాధికతో పాటు చెల్లెలు, తమ్ముడు, తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పార్టీలకు దూరంగా ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో కలసి కేఫ్‌లలో టీ పార్టీ చేసుకుంటాడు. సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తాడు