'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం | Ajay Devgn And His Son Dub For Karate Kid Legends | Sakshi
Sakshi News home page

Ajay Devgn: 'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం

May 13 2025 6:40 PM | Updated on May 13 2025 6:43 PM

Ajay Devgn And His Son Dub For Karate Kid Legends

హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన 'కరాటే కిడ్: లెజెండ్స్' ఇప్పుడు సరికొత్తగా భారతీయ ప్రేక్షకులని పలకరించబోతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, కొడుకు యుగ్ కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్‌ కోసం పనిచేశారు.

(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో 

జాకీ చాన్ మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగన్ గొంతు అందించగా, బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు. తొలిసారి ఇంటర్నేషనల్ సినిమాకు వాయిస్ ఇవ్వడం అజయ్ దేవగన్‌కి ఇదే తొలిసారి.

సినిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్‌కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)  

Advertisement
 
Advertisement
Advertisement