
తమిళ కమెడియన్ కమ్ హీరో సంతానం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డీడీ నెక్స్ట్ లెవల్'. ఈ శుక్రవారం (మే 16)న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడంతో హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్వయంగా హీరోనే స్పందించాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)
శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు. అయితే ఈ గీతాన్ని 'డీడీ నెక్స్ట్ లెవల్' సినిమా కోసం పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడీ చేశారు. దీనిపై తమిళనాడులోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పుడు ఈ వివాదంపై స్వయంగా సంతానం స్పందించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 'తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. వాటిని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. ఇప్పటికే సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)