
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ. ఇప్పుడు ఈమె హైదరాబాద్ లో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. శాస్త్రోక్తంగా సోమవారం ఉదయం గృహప్రవేశం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
'ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలో మరో అధ్యాయం. శ్రీరామ సంజీవని. మా కొత్తింటి పేరు.. జైశ్రీరామ్. జై హనుమాన్' అని అనసూయ ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: మైనపు విగ్రహంతో రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్)
తెలుగు సంప్రదాయ ప్రకారం ఆవుని ఇంట్లోకి తీసుకురావడం, పాలు పొంగించడం, పూజ చేయడం, తన కుటుంబంతో కలిసి దేవుళ్ల పటాలతో ఇంట్లో అడుగుపెట్టడం.. ఏమేమైతే చేసిందో వాటిని ఫొటోలుగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్ని హితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇంటి ఖరీదు రూ.కోట్లలోనే ఉండొచ్చని సమాచారం.
పుష్ప 2లో చివరగా కనిపించిన అనసూయ.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏం చేస్తుందో తెలీదు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'అరి' రిలీజ్ కావాల్సి ఉంది. మరోవైపు తెలుగులో ఒకటి రెండు రియాలిటీ షోలు చేస్తోంది.
(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?)