
పూరీ జగన్నాథ్ కు వరస డిజాస్టర్లు పడ్డాయి. దీంతో టైం తీసుకుని విజయ్ సేతుపతిని ఓ సినిమా చేసేందుకు ఒప్పించాడు. ఇదంతా కొన్నిరోజుల క్రితం సంగతి. అప్పటినుంచి ఈ ప్రాజెక్టులోకి ఒక్కో యాక్టర్ వస్తున్నారు. ఇదివరకే టబు, దునియా విజయ్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా ఇన్ స్టా బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తోంది.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి దెబ్బ మీద దెబ్బ పడింది. దీంతో పూరీ ఇకపై మూవీస్ చేయడం సందేహమే అని అందరూ ఫిక్సయ్యారు. మరి ఏం స్టోరీ చెప్పాడో ఏమో గానీ విజయ్ సేతుపతి.. పూరీతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పాడు. కొన్నిరోజుల క్రితం ఈ కాంబోని అధికారికంగా ప్రకటించారు కూడా.
(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)
బెగ్గర్ అనే టైటిల్ అనుకున్నారని, అందుకు తగ్గట్లే కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందనే ప్రచారం జరిగింది. టబు, దునియా విజయ్ లాంటి స్టార్స్ ని తీసుకునే సరికి అంచనాలు కాస్త ఏర్పడ్డాయి. ఇన్ స్టా వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న నిహారికని ఇప్పుడు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్.
తొలుత విజయ్ సరసన రాధిక ఆప్టే నటిస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఫైనల్ గా నిహారిక ఆ పాత్రలో నటించనుందని సమాచారం. ఇన్ స‍్టాలో ఈమెకు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మేజర్ సినిమాని నిర్మించిన మహేశ్ బాబు తో కలిసి ప్రమోషన్ చేయడంతో ఈమె ఫేమస్ అయింది. తర్వాత తమిళంలో ఇదయం మురళి, పెరుసు చిత్రాల్లో నటించింది. అలా ఇప్పుడు పూరీ కొత్త మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిహారిక లక్ తోక తొక్కినట్లే.
(ఇదీ చదవండి: అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?)