
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి కౌర్. ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. గతేడాది పూరి జగన్నాధ్‌తో కలిసి డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. నీ తోడు కావాలి అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఛార్మి.. మాస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరమైనా తర్వాత మరింత బొద్దుగా తయారైన ఛార్మి సడన్‌కు అభిమానులకు షాకిచ్చింది. తాను ప్రస్తుతం 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత బరువు తగ్గుతానని తెలిపింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సూపర్బ్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు.