
ప్రస్తుత తరం తెలుగు కమెడియన్లలో వెన్నెల కిశోర్ టాప్ లో ఉంటాడు. దాదాపు ప్రతి సినిమాలోనూ చిన్నదో పెద్దదో పాత్ర అయితే చేస్తుంటాడు. రీసెంట్ గా శ్రీ విష్ణు 'సింగిల్' మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కడుపుబ్బా నవ్వించాడు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ సంగతులు కొన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?)
దూకుడు సినిమాతో తన కెరీర్ టర్న్ అయిందని చెప్పిన వెన్నెల కిశోర్.. ఆ మూవీలో ఛాన్స్ వచ్చిన సందర్భంగా ఎదురైన ఆసక్తికర అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. 'దూకుడు టైంలో దర్శకుడు శ్రీను వైట్ల.. నన్ను లైపో సర్జరీ చేయించుకోమన్నారు. ఆయనే డబ్బులు కూడా ఇస్తానని అన్నారు. ఎందుకంటే మహేశ్ బాబు పక్కన ఉండే రోల్ అందరూ సన్నగా కనిపిస్తారు. నువ్వు లావుగా ఉంటే బాగోదని అన్నారు. నేను నేచురల్ గానే తగ్గుతానని చెప్పా. కానీ తర్వాత తగ్గలేదు. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఇలానే బాగుందని శ్రీనువైట్ల చెప్పారు' అని కిశోర్ చెప్పుకొచ్చాడు.
అలానే గతకొన్నేళ్లలో ప్రభాస్, ఎన్టీఆర్ ల రేంజ్ పెరిగిపోయింది, వాళ్ల ఇమేజ్ మారిపోయింది. అలాంటి హీరోల సినిమాలో తనకు సరైన క్యారెక్టర్స్ రాయడం సాధ్యం కాదు కదా అని వెన్నెల కిశోర్ చెప్పుకొచ్చాడు. వారి సినిమాల్లో తాను ఊరికే నిలబడి చూడటం తప్పితే చేసేదేం ఉండని అన్నాడు. అలానే తనకు పెళ్లి అయిందని, కాకపోతే ఆ విషయాన్ని ప్రైవసీగానే ఉంచుదామనే ఎవరికీ చెప్పలేదని అన్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే)