
హాలీవుడ్ ప్రముఖ నటి అంబర్ హెర్డ్.. తాను కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం (మే 11) ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పిల్లలకు తండ్రి ఎవరు అనే ప్రశ్న ఈమెకు ఎదురవుతోంది. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)

ఎందుకంటే అంబర్ హెర్డ్.. 2015లో 'పైరేట్స్ ఆఫ్ కరీబియన్' ఫేమ్ నటుడు జానీ డెప్ ని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ల బంధం పట్టుమని రెండేళ్లు కూడా నిలబడలేదు. 2017లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. మరోవైపు జానీ డెప్ తో విడాకులకు ముందే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ తో అంబర్ డేటింగ్ చేసింది.
2016-18 మధ్య అంబర్-మస్క్ డేటింగ్ లో ఉన్నారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ పిల్లల్ని కనాలనుకున్నారని.. అప్పుడు కుదరకపోవడంతో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారని, వాటితోనే ఇప్పుడు అంబర్.. ట్విన్స్ కి జన్మనిచ్చిందేనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పిల్లలకు తండ్రి ఎవరనేది సదరు నటి చెబితే తప్ప క్లారిటీ రాదు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే)