
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన కరాటే కిడ్ ఫ్రాంచైజ్ మరోసారి తెరపైకి రానుంది. మే 30న విడుదల కానున్న కరాటే కిడ్: లెజెండ్స్ చిత్రంలో లెజెండరీ యాక్షన్ హీరో జాకీ చాన్ మిస్టర్ హాన్‌గా తిరిగి కనిపించనున్నారు. ఈ సినిమాలో బెన్ వాంగ్ హీరోగా నటిస్తుండగా, రాల్ఫ్ మాకియో డేనియల్ లారూసో పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకు హిందీ డబ్బింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు గొంతు ఇవ్వగా, అతని కుమారుడు యుగ్ దేవగణ్ బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు వాయిస్ ఓవర్‌తో సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. తండ్రి-కొడుకు ఇద్దరూ ఒకే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి, ఇది బాలీవుడ్‌లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా జాకీ చాన్, బెన్ వాంగ్‌తో కలిసి అజయ్ – యుగ్ దేవగణ్ ఆన్‌లైన్ లో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్.. తన తండ్రి వీరు దేవగణ్ గురించీ, జాకీ చాన్ గురువు మిస్టర్ మియాగీగురించి మాట్లాడారు. యుగ్ దేవగణ్ తన తండ్రి లేనిదే నేను లేను అని చెప్పాడు. అలాగే అజయ్.. ఇప్పుడు యాక్షన్ సీన్స్ చాలా ఈజీ. మునుపటిలా కేబుల్స్ వాడి గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది. కానీ హార్డ్ వర్క్‌కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు అని తెలిపారు. అలాగే బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయాలని జాకీ చాన్ అన్నారు.“నీవు ఫైట్ చేస్తావు, నేను డ్యాన్స్ చేస్తా” అని అజయ్‌తో జోక్ చేస్తూ, భవిష్యత్తులో బాలీవుడ్‌లో కలిసి పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.