
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ తన కుమారుడు యుగ్ దేవ్‌గన్‌తో కలిసి ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది తొలిసారి తండ్రీ-కొడుకులు కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో పని చేయడం కావడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ హాలీవుడ్ లెజెండ్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు హిందీలో తన గొంతునిచ్చారు. ఇది అజయ్ దేవ్‌గన్‌కు అంతర్జాతీయ సినిమా డబ్బింగ్‌లో తొలి అడుగు కావడం విశేషం. అదే సమయంలో, యుగ్ దేవ్‌గన్ కథానాయకుడు లీ ఫాంగ్ (బెన్ వాంగ్ నటించిన పాత్ర) పాత్రకు డబ్బింగ్ చేస్తూ బాలీవుడ్‌లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించారు. యుగ్‌లోని యువ శక్తి మరియు గొంతులోని శక్తివంతమైన టోన్ ఈ పాత్రకు కొత్త జీవం పోస్తున్నాయి.
నిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్‌కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.