
'బాహుబలి' రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ తదితర చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోలు తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొందరు సౌత్ దర్శకులు.. హిందీ హీరోలతో తీసిన జవాన్, యానిమల్ లాంటివి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
ఈ క్రమంలోనే గత కొన్నాళ్లలో హిందీ నటీనటులు.. బాహాటంగానే సొంత ఇండస్ట్రీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. 'కేజీఎఫ్' చిత్రంలో విలన్‌గా అలరించిన ఇతడు.. ఇప్పుడు 'కేడీ ది డెవిల్' అనే మరో కన్నడ మూవీలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులోనే సంజయ్ దత్.. బాలీవుడ్ పరిస్థితి ఏంటో చెప్పేశాడు.
(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)
ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన సంజయ్ దత్.. 'మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్‌ని బాలీవుడ్‌కి తీసుకెళ్తా. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు.. కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్‌లో అలా కాదు. ముఖ్యంగా తెలుగులో మూవీస్‌పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఆ చిత్రంతో పాటు తెలుగు సినీ పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 'తెలుగులో చాలామంది నిర్మాతలు నాకు తెలుసు. వాళ్లతో కలిసి నేను పనిచేశాను. 1980ల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఫుడ్ బాగుంటాయి. తెలుగులో ప్రభాస్‌తో సినిమా చేస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ప్రభాస్ నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాడు' అని సంజూ చెప్పాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే బాలీవుడ్‌లో ఇప్పుడు ఎవరూ సరైన సినిమాలు తీయట్లేదని, ఈ విషయంలో టాలీవుడ్ చాలా బెటర్ అని అర్థం. ఓ రకంగా చూస్తే పరోక్షంగా సొంత ఇండస్ట్రీ పరువునే తీసేశాడు!
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)