
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)
2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్‌లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.
ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)