
టాలీవుడ్ రూపురేఖల్ని మార్చిన సినిమా 'బాహుబలి'. సరిగ్గా పదేళ్ల క్రితం థియేటర్లలో తొలి భాగం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి ఏ పెద్ద సినిమా రిలీజైనా సరే 'బాహుబలి' రికార్డ్స్‌ని సదరు చిత్రం దాటిందా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ఈ చిత్రానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీమ్ అంతా మరోసారి కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ మొత్తం ఫొటోల్లో చాలామంది ప్రభాస్ లుక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. డార్లింగ్ అభిమానులైతే తెగ సరదా పడిపోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ అనుష్క కనిపించకపోవడం మాత్రం కాస్త వెలితిగా అనిపించింది. ఇంతకీ ఆమె రాకపోవడానికి కారణం ఏంటా అని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)
అయితే 'బాహుబలి' చేస్తున్న టైంలో 'సైజ్ జీరో' అనే మూవీ చేసిన అనుష్క.. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా బరువు పెరిగింది. కానీ తగ్గే విషయంలో మాత్రం అప్పటినుంచి పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. అందుకే బాహుబలి తర్వాత పలు సినిమాలు చేసినా సరే బయట పెద్దగా కనిపించలేదు. కనీసం ప్రెస్ మీట్స్‌కి కూడా హాజరు కాలేదు. ఇప్పుడు కూడా అందుకే రీ యూనియన్ పార్టీకి హాజరు కాలేదని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే అనుష్క నటించిన 'ఘాటీ' సినిమా లెక్క ప్రకారం జూలై 11న అంటే ఈ రోజు(శుక్రవారం) థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడనేది టీమ్ చెప్పలేదు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. చాలా భాగం అడవి బ్యాక్ డ్రాప్‌లో తీశారు. మరి ఈ మూవీ రిలీజ్ ముందైనా సరే అనుష్క.. బయటకొస్తుందా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం)