
సూపర్‌స్టార్ రజనీకాంత్.. గత నెలలో 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విడుదలకు ముందు బీభత్సమైన అంచనాలు ఉండగా.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత చాలా నిరాశపరిచింది. కథకథనం ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అతిథి పాత్ర చేసిన ఆమిర్ ఖాన్ కూడా ఇందులో నటించానని తప్పు చేశానని అన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీలో నటించిన హీరోయిన్ రెబా మోనికా కూడా చాలా అప్‌సెట్ అయ్యానని బహిరంగంగానే చెప్పింది.
తెలుగులో సామజవరగమన, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ తదితర చిత్రాల్లో నటించిన రెబా మోనికా జాన్.. తమిళ, మలయాళంలోనూ హీరోయిన్గా మూవీస్ చేస్తోంది. 'కూలీ'లో శ్రుతి హాసన్ చెల్లి పాత్రలో ఈమె నటించింది. సినిమా మొత్తంలో ఈమెవి మూడు నాలుగు సీన్లు మాత్రమే ఉంటాయి. డైలాగ్స్ ఏం ఉండవు. తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్స్‌తో ముచ్చటించిన ఈమె.. 'కూలీ'లో నటించడంపై ఇప్పుడు స్పందించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
'చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నా పాత్రని ఇంకాస్త బాగా చూపించి ఉండొచ్చు. కానీ పరిస్థితులు కుదరక అనుకున్నది జరగలేదు. కానీ తలైవర్ రజనీకాంత్‌తో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను' అని ఓపెన్‌గానే రెబా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రెబా మాత్రమే కాదు 'కూలీ'లో ఉపేంద్ర పాత్రకు కూడా పరిమిత స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది. నాగార్జున పాత్రని కూడా ప్రారంభంలో బాగానే చూపించారు కానీ ముగింపు సరిగా ఇవ్వలేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌పైనా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
(ఇదీ చదవండి: నేను ఇప్పుడు ఇలా.. అల్లు అర్జున్ దీనికి కారణం: తమన్నా)
I am really upset and disappointed ☹️ I know I could have offered so much more but sometimes things dont go your way. Still I am happy that I got the chance to work with #Thalaivar #Rajinikanth 🙂
– #RebaMonicaJohn opens up about her role in #Coolie 📽️
pic.twitter.com/zDUEAKHUMC— Movies Singapore (@MoviesSingapore) September 23, 2025