
రజనీకాంత్‌ను ఓ పవర్‌ఫుల్ విలన్‌గా చూపించే ప్రయత్నం మిస్ అయ్యిందని అంటున్నారు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. నాగార్జున, శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘కూలీ’ సినిమా ప్రయాణం గురించి లోకేశ్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘కూలీ’ సినిమా కంటే ముందు రజనీకాంత్‌గారికి ఓ పెద్ద కథ చెప్పాలనుకున్నాను. అందులో రజనీకాంత్‌గారిది విలన్ పాత్ర. మిగతా లీడ్ రోల్స్ హీరో పాత్రల మాదిరిగా ఉంటాయి. అయితే ఈ సినిమా నేను చేయడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. రజనీకాంత్‌గారు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నా సినిమా కోసం ఆయన రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేయడం నాకు ఇష్టం లేదు.
అదే సమయంలో నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ సినిమాను వద్దనుకుని, ‘కూలీ’ సినిమా కథ చెప్పగా, రజనీకాంత్ గారు ఓకే చేశారు. అలా ఆయనతో ‘కూలీ’ సినిమా చేయడం జరిగింది. అయితే నా ‘ఎల్‌సీయూ’ (లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ‘కూలీ’ భాగం కాదు. అలాగే ‘కూలీ’ సినిమాలో ఓ మంచి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఈ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఇక ‘కూలీ’ సినిమా తర్వాత లోకేశ్ డైరెక్షన్‌లో ‘ఖైదీ 2’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్. ఇంకా కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ వంటి సినిమాలు లైనప్‌లో ఉన్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు లోకేశ్.