
అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.
4కెలో శివ ..
అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది. శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ప్లాన్‌తో వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు.
కూలీ థియేటర్లలో ట్రైలర్..
అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ రోజే నాగార్జున్ ఈ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్కు డబుల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ రీ రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు.
Hey @iamnagarjuna CONGRATS to #ShivaTeam ,and all your FANS #Shiva4KDolbyAtmos https://t.co/6zfsam7uvr
— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2025