
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో విడుదలైన కూలీ సినిమాకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ మూవీలో కన్నడ నటి రచితా రామ్ 'కల్యాణి' అనే పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. వాస్తవంగా ఆమె కన్నడ సినిమాలో హీరోయిన్.. అయితే, రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడంతో కూలీలో విలన్ పాత్ర చేసింది. ఇందులో ఆమె పాత్రను విక్రమ్ సినిమాలో కనిపించిన ఏజెంట్ 'టీనా' పాత్రకు 'రివర్స్ వెర్షన్'గా ఉంటుందని చెప్పవచ్చు.
కూలీ సినిమాలో కల్యాణిగా నటించిన రచితా రామ్ ఎవరంటూ టాలీవుడ్ షోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. “సర్ప్రైజ్ ప్యాకేజ్” అని అభిమానులు అభివర్ణించారు. ఆమె పాత్రతో కథలో ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. కూలీలో రచితా రామ్ పాత్ర ఉపేంద్ర కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ పొందిందంటూ కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా కన్నడలో ఆమె పేరు భారీగా వైరల్ అవుతుంది.
రచితా రామ్ 2013లో మొదటిసారి దర్శన్‌తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్స్‌తో నటించింది.

తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో సినిమా
2022లో తెలుగులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్‌గా నటించింది. 'సూపర్ మచ్చి' చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఆశించింది. కానీ, ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆమె కెరీర్‌లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తెలుగులో ఆమెకు మరో సినిమా ఛాన్స్ దక్కలేదు.
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్ధతుగా
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్ధతుగా రచితా రామ్ గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. ' నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శన్.. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్‌బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు.

ప్రెస్‌మీట్‌లో బోల్డ్ కామెంట్
కన్నడ సినిమా ప్రెస్‌మీట్‌లో ఆమె ఒకసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకుంది. ఆమె నటించిన కన్నడ సినిమా ‘లవ్ యూ రచ్చు’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెను చిక్కుల్లో పడేసింది 'బోల్డ్ కంటెంట్‌తో ఉన్న ఇలాంటి సినిమాలో మీరు నటించడానికి గల కారణం ఏమిటి..?' అనే ప్రశ్నకు ‘‘ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వారందరూ పెళ్లైన వారే అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య ఉండే రొమాన్స్‌నే మేము ఈ సినిమాలో చూపించాం. బోల్డ్ సీన్స్‌కీ ఓ కారణం ఉంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడండి..’’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.