
తమిళంలో విడుదల కానున్న ' కూలీ ' సినిమా హిందీ రిలీజ్ పంపిణీ వ్యవహారాల్లో ఆమిర్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఎకెపి) ప్రతినిధి స్పందించారు. హీందీలో కూలీ సినిమా పంపిణీ వ్యూహంలో ఆమిర్ ఖాన్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఖాన్ అతిధి పాత్రలో మాత్రమే నటిస్తున్నారని తన టీమ్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో కూలీ సినిమా పంపిణీ విషయంలో ఖాన్, అతని టీమ్ నుంచి ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. మిస్టర్ ఖాన్ ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌కు ఎటువంటి కాల్స్ చేయలేదని తెలిపారు.
వార్2 సినిమాకు పోటీగా దేశవ్యాప్తంగా కూలీ ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని ఆమీర్ ప్లాన్ చేశాడని, ఈ క్రమంలోనే PVR-Inox CEO అజయ్ బిజ్లీకి నేరుగా ఫోన్ చేసినట్లు ఒక వార్త వైరల్ అయింది. అంతే కాకుండా కూలీ మూవీ కోసం ప్రైమ్ స్లాట్‌లను ఆయన కోరినట్లు చెప్పుకొచ్చారు. వార్2ను దెబ్బకొట్టేందుకే ఆమీర్ ఇలాంటి ప్లాన్ చేస్తున్నారని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో నేరుగా అమీర్ టీమ్ రంగంలోకి దిగింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపింది.
కూలీ చిత్రంలో అతిధి పాత్రలో నటించాలని కోరినప్పుడు ఆమీర్ వెంటనే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్, రజనీకాంత్‌తో ఆయనకున్న బంధానికి ఇదొక నిదర్శనమని క్లారిటీ ఇచ్చారు. కూలీ, వార్2 రెండు చిత్రాలు ఆగష్టు 14న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.