డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటేస్ట్ మూవీ డ్యూడ్. ఈ దీపావళికి థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో డ్రాగన్ హీరో హ్యాట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. సింగారి అనే సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 17న రిలీజైన ఈ చిత్రంలో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు.
#Singari video song from #Dude out now 🤩🤩
Tamil ▶️ https://t.co/W6GmIS2HeD
Telugu▶️https://t.co/pU5RQH4swg
Vibe to this beautiful composition ❤️
A @SaiAbhyankkar musical 🎼
⭐ing 'The Sensational' @pradeeponelife
🎬 Written and directed by @Keerthiswaran_
Produced by… pic.twitter.com/hf6XMeMwE3— Mythri Movie Makers (@MythriOfficial) October 29, 2025


