'నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు'.. రూమర్స్‌పై టాలీవుడ్‌ హీరోయిన్ ఆగ్రహం | Tollywood Actress Mehreen Pirzada Reacts On Marriage Rumours | Sakshi
Sakshi News home page

Mehreen Pirzada: 'నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు'.. రూమర్స్‌పై మెహరీన్‌ ఫైర్..!

Dec 16 2025 6:03 PM | Updated on Dec 16 2025 6:22 PM

Tollywood Actress Mehreen Pirzada Reacts On Marriage Rumours

టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీమామ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాలతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా రాజా ది గ్రేట్‌ చిత్రంలో రవితేజ సరసన కనిపించింది.

అయితే సినీతారలపై రూమర్స్ రావడం సహజం. డేటింగ్, పెళ్లి అంటూ ఎప్పుడో ఒకసారి రూమర్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మెహరీన్‌పై కూడా అలాగే వదంతులు వచ్చాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహరీన్‌ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలిపోయింది. ‍అప్పటి నుంచి మెహరీన్‌ సినిమాలతో బిజీ అయిపోయింది.

అయితే తాజాగా మరోసారి మెహరీన్‌ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. దీంతో మెహరీన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకపోయినా ఇలాంటి వార్తలు రాయడం చూస్తుంటే వింతగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కేవలం డబ్బుల కోసం పనికిమాలిన వార్తలతో జర్నలిజం పూర్తిగా దెబ్బతినిందని మెహరీన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ విషయంపై రెండు ఏళ్లుగా మౌనంగా ఉన్నానని..  నిరంతరం ఇలాంటి వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

తాను ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాశారని మెహరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడు కలవని వ్యక్తితో  పెళ్లయిందని రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. నాకు ఇప్పటి వరకు ఎవరితోనూ పెళ్లి కాలేదు.. నన్ను నమ్మండి అంటూ పోస్ట్‌ చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసుకుంటానని మెహరీన్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్‌తో మెహరీన్‌ పెళ్లి రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement