ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు | New OTT releases this week (Nov 10–16): Telugu hits, Delhi Crime S3, Dude, Telusu Kada | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: థియేటర్లలో 'కాంత' సహా పలు మూవీస్.. మరి ఓటీటీల్లో?

Nov 10 2025 12:36 PM | Updated on Nov 10 2025 1:06 PM

Upcoming OTT Movies Telugu November Second Week 2025

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రీస్, స్కూల్ లైఫ్, సీమంతం, ఆటకదరా శివ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అలానే నాగ్ కల్ట్ క్లాసిక్ 'శివ' రీ రిలీజ్ కానుంది. 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఇదే వీకెండ్‌లో థియేటర్లలోకి విడుదల కానుంది.

(ఇదీ చదవండి: 'పర్ఫామెన్స్‌ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?)

మరోవైపు ఓటీటీల్లో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ హిట్ చిత్రాలు ఇదే వారం స్ట్రీమింగ్ కానుండటం విశేషం. గత నెలలో దీపావళి రిలీజై ఆకట్టుకున్న డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్.. ఆయా ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు అవిహితం, జూరాసిక్ రీ బర్త్ అనే డబ్బింగ్ మూవీస్, ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 10 నుంచి 16 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • మెరైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 10
  • ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 12
  • ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - నవంబరు 13
  • తెలుసు కదా (తెలుగు మూవీ) - నవంబరు 14
  • డ్యూడ్ (తెలుగు సినిమా) - నవంబరు 14
  • ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 14
  • జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14
  • నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) - నవంబరు 14

 

అమెజాన్ ప్రైమ్

  • ప్లే డేట్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 12

హాట్‌స్టార్

  • జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ మూవీ) - నవంబరు 14
  • అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 14
  • జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 14

జీ5

  • దశావతార్ (మరాఠీ సినిమా) - నవంబరు 14
  • ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) - నవంబరు 14

ఆహా

  • కె ర్యాంప్ (తెలుగు సినిమా) - నవంబరు 15

సన్ నెక్స్ట్

  • ఎక్క (కన్నడ మూవీ) - నవంబరు 13

ఆపిల్ టీవీ ప్లస్

  • పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 12
  • కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14

మనోరమ మ్యాక్స్

  • కప్లింగ్ (మలయాళ సిరీస్) - నవంబరు 14

సింప్లీ సౌత్

  • పొయ్యమొళి (మలయాళ సినిమా) - నవంబరు 14
  • యోలో (తమిళ మూవీ) - నవంబరు 14

(ఇదీ చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్‌.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement