హీరో ప్రదీప్‌ కాళ్ల దగ్గర.. ఆ పని ఎలా చేశావ్‌? | How Can You Sit Near Pradeep Feet And Cry? Sarath Kumar Answer to Devayani Question | Sakshi
Sakshi News home page

ప్రదీప్‌ కాళ్ల దగ్గర కూర్చుని ఎలా ఏడ్చావ్‌? శరత్‌ కుమార్‌ ఆన్సరిదే!

Dec 19 2025 12:51 PM | Updated on Dec 19 2025 1:13 PM

How Can You Sit Near Pradeep Feet And Cry? Sarath Kumar Answer to Devayani Question

ఈ ఏడాది సెంచరీ దాటేసిన సినిమాల్లో డ్యూడ్‌ కూడా ఉంది. తమిళ యంగ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. హీరోయిన్‌ తండ్రిగా, హీరోకి మామగా, రాజకీయ నాయకుడిగా శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించాడు. అయితే అతడి కుల పిచ్చి ఎక్కువ.

దేవయాని ఫోన్‌
సినిమా చివర్లో హీరో అతడి కళ్లు తెరిపిస్తాడు. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో హీరో కాళ్ల దగ్గరపడి ఏడుస్తాడు శరత్‌ కుమార్‌. ఈ సీన్‌ చూసి సీనియర్‌ నటి దేవయాని ఆశ్చర్యపోయిందట! ఈ విషయాన్ని తాజాగా బిహైండ్‌వుడ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్‌ కుమార్‌ గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. డ్యూడ్‌ సినిమా చూసి దేవయాని నాకు ఫోన్‌ చేసింది. 

ఆ సీన్‌ చూసి షాక్‌
చాలా బాగా చేశానని మెచ్చుకుంది. అలాగే నేను ప్రదీప్‌ కాళ్ల దగ్గర కూర్చుని చేసిన ఎమోషనల్‌ సీన్‌ చూసి షాకైంది. ఆ సన్నివేశం ఎలా చేయగలిగావ్‌? అని అడిగింది. అప్పుడు నేనొక్కటే చెప్పాను. నేను హీరో ప్రదీప్‌ దగ్గర కూర్చుని ఏడవలేదు. నా చెల్లెలి కొడుకు దగ్గర కన్నీళ్లుపెట్టుకున్నాను (సినిమాలో ప్రదీప్‌ తన మేనల్లుడిగా నటించాడు). 

తప్పేముంది?
అందులో తప్పేముంది. ఒక నటుడిగా ఆ సీన్‌ చేసేటప్పుడు నాకెటువంటి హద్దులు, భయాలు ఉండకూడదు అని చెప్పాను అని వెల్లడించాడు. డ్యూడ్‌ (Dude Movie) విషయానికి వస్తే.. కీర్తిశ్వరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్‌ రివ్యూస్‌తోనే అవలీలగా రూ.100 కోట్లు దాటేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement