ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దక్షిణాదిలోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. చూసిన చాలామందికి ఇది నచ్చేస్తోంది. మరికొందరు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. ఈ క్రమంలోనే 'ధురంధర్' డిజిటల్ డీల్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. రాబోయే మార్చి 19న అది థియేటర్లో ఇది విడుదల కానుంది.
(ఇదీ చదవండి: 'ధురంధర్' నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు)
అసలు విషయానికొస్తే.. 'ధురంధర్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే రూ.130 కోట్లకు ఈ డీల్ జరిగిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ రాగా.. ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్లతో ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఏదేమైనా ఏదో ఒకలా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది.
'ధురంధర్' స్ట్రీమింగ్ విషయానికొస్తే థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే వచ్చే జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఉందని మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతవరకు ఈ విషయంపై క్లారిటీ అయితే రాలేదు.
(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)


