ముచ్చటగా మూడో సినిమాకు సెంచరీ కొట్టిన 'డ్యూడ్‌' | Pradeep Ranganathan Dude Movie Crosses Rs 100 Cr | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ సెన్సేషన్‌గా ప్రదీప్‌.. వరుసగా మూడో సెంచరీతో రికార్డు

Oct 23 2025 4:03 PM | Updated on Oct 23 2025 4:19 PM

Pradeep Ranganathan Dude Movie Crosses Rs 100 Cr

కాస్త నెగెటివ్‌ టాక్‌ వచ్చిందంటే సినిమా బండి ముందుకెళ్లడం కష్టమే! కానీ ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) మాత్రం మిక్స్‌డ్‌ టాక్‌నే ఇంజనుగా మార్చుకుని రయ్యిమని బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన డ్యూడ్‌ సినిమా (Dude Movie) ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. బ్లాక్‌బస్టర్‌ దివాళీ సీజన్‌ అంటూ రూ.100 కోట్ల పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. మూడు సినిమాలకు వరుస సెంచరీ సాధించిన హ్యాట్రిక్‌ హీరోగా ప్రదీప్‌ చరిత్ర సృష్టించాడు. డ్యూడ్‌ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించగా శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించాడు.

సినిమా
ప్రదీప్‌ రంగనాథన్‌.. ఎల్‌కేజీ సినిమాకు డైలాగ్స్‌ రాశాడు. కోమలి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇందులో అతిథి పాత్రలోనూ మెరిశాడు. లవ్‌ టుడే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్వీయదర్శకత్వం వహించిన ఈ సినిమా వంద కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. రెండో సినిమా డ్రాగన్‌ సైతం సెంచరీ దాటేసి ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్స్‌ కొల్లగొట్టింది. ముచ్చటగా మూడో సినిమా కూడా సెంచరీ దాటేసింది. మరి డ్యూడ్‌ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!

 

 

చదవండి: బిగ్‌బాస్‌ 9: సడన్‌గా రౌడీ బేబి ఎలిమినేట్‌! ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement