
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోయారు. ఒకరు మళ్లీ తిరిగొచ్చారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీశ్, శ్రీజ, భరణి వరుసగా వెళ్లిపోయారు. మధ్యలో సంజనాను మిడ్‌వీక్‌లో హౌస్‌మేట్స్ ఎలిమినేట్ చేశారు. కానీ, బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపించాడు. వీకెండ్‌లో సంజనా వెళ్లిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్లీ హౌస్‌లోకి పంపించారు.
నామినేషన్స్‌లో 8 మంది
ఇక ఏడోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మందున్నారు. వారే.. తనూజ, పవన్ కల్యాణ్, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్, రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్‌లోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావొచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్. ఫుల్ జోష్‌తో హౌస్‌లో అడుగుపెట్టింది.

ఆరోగ్య సమస్యలు
అరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికిమాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించింది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం.. ఆయేషా (Ayesha Zeenath)కు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్‌లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్‌లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.
రీతూను టార్గెట్ చేసి..
నిజానికి ఆమె హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా! కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే వరస్ట్ అనిపించుకుంది. రీతూను టార్గెట్ చేసి ఆమె నెగెటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్స్‌లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కానీ, వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్లిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్‌లోనే కొనసాగుతుందా? అనేది చూడాలి!
చదవండి: సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమన్న మాధురి