
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్‌గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్‌గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.
మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్‌లో చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటారు. శరత్ కుమార్‌గారి లాంటి సినియర్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్‌గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్‌గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.