'డ్యూడ్' టైటిల్ మాది.. ఏడాది క్రితమే రిజిస్టర్ | Dude Movie Telugu Title Controversy | Sakshi
Sakshi News home page

Dude Movie: 'డ్యూడ్' టైటిల్ మాది.. ఏడాది క్రితమే రిజిస్టర్

May 12 2025 1:14 PM | Updated on May 12 2025 1:14 PM

Dude Movie Telugu Title Controversy

ప్రదీప్ రంగనాథ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న సినిమాకు డ్యూడ్ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ పేరు ప్రకటించడం తనని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసిందని హీరో-నిర్మాత-దర్శకుడైన తేజ్ అంటున్నాడు. ఏడాది నుంచి 'డ్యూడ్' సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 

(ఇదీ చదవండి: నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్)

మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశ్యం తనకు లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ దృష్టికి తీసుకువెళ్లామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తేజ్ పేర్కొన్నారు.

తేజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా డ్యూడ్. తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో తీస్తున్నారు. ఫుట్ బాల్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి టైటిల్ విషయమై ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement