
లోకేశ్ కనగరాజ్ పేరుకే తమిళ దర్శకుడు గానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్. కానీ లోకేష్ ఇప్పటినుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడిన లోకేశ్ కనగరాజ్.. పలువురు పాన్ ఇండియా హీరోలు, డైరెక్టర్లపై పరోక్షంగా సెటైర్లు వేశాడా అనిపించింది. 'నేనేమి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయట్లేదుగా మూడేళ్లు పట్టడానికి. 'కూలీ'ని 6-8 నెలల్లో పూర్తి చేశా. అలానే నా సినిమాలో చేసే నటీనటుల్ని ఎవరినీ మీ గెటప్ మార్చొద్దు. వేరే సినిమాలు చేసుకోవద్దు అని చెప్పను. సాధారణంగా నేను అలాంటి రకం కాదు. అవేం చెప్పకపోయినా సరే వాళ్లు నాతో సినిమాలు చేస్తున్నారు' అని లోకేశ్ అన్నాడు.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా)
లోకేశ్ మాటల‍్ని బట్టి చూస్తే.. ప్రస్తుతం చాలామంది పాన్ ఇండియా హీరోలు ఒక్క సినిమాకే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు. లుక్ అది ఇది అని చాలా హడావుడి చేస్తున్నారు. కానీ లోకేశ్ మాత్రం స్టార్ హీరోలతో కూడా నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. బహుశా తన వర్కింగ్ స్టైల్ ఇది అని చెప్పుకోవడానికే ఈ కామెంట్స్ చేసినట్లు అనిపిస్తుంది.
కూలీ విషయానికొస్తే.. రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ లాంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో ఉండటం విశేషం. రీసెంట్ గా రిలీజ్ కి మరో 100 రోజులే ఉందని ఓ వీడియో రిలీజ్ చేశారు. నటీనటుల తలవెనక షాట్స్ చూపించే హైప్ పెంచేశాడు. మరో నెల తర్వాత పూర్తిస్థాయి ప్రమోషన్స్ మొదలుపెడతారేమో?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)
“I’m not making a film like #RRR that takes 3 years. 'Coolie' will be shot in 6–8 months.
I asked actors not to change getup or do other films. I don’t usually say that… but they still agreed.”
— #LokeshKanagaraj | #Coolie
pic.twitter.com/XC66jkJUv5— Whynot Cinemas (@whynotcinemass_) May 11, 2025