
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమిపై ఉద్భవించిన పర్వదినం కృష్ణాష్టమి. ఈ శనివారం కృష్ణాష్టమి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న కొన్ని వేణుగోపాల స్వామి ఆలయాల గురించి

సికింద్రాబాద్‌కి సుమారు 30 కి.మీ. దూరంలో ఘటకేసర్ మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఏదులాబాద్ గ్రామంలో వెలసిన క్షేత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో శక్తిమంతమైన ప్రాచీన క్షేత్రం.

శ్రీకాకుళం జిల్లాలో వెలసిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం మెళియాపుట్టి గ్రామంలో కొలువై ఉంది. టెక్కలికి 24 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో గల ఆలయాన్ని గజపతిమహారాజు 1810 లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.

హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌కి సమీపంలో గల శ్రీ కృష్ణమందిరానికే శ్యాం మందిర్ అని పేరు. ఈ మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

నరసాపురంలో కొలువైన రాజగోపాలస్వామి దేవాలయం 18 వ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది. గోదావరి నదిలో విగ్రహం లభించగా దానిని తీసుకొని వచ్చి ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయంలో కొలువైన కృష్ణుడిని కల్యాణ కృష్ణుడిగా పిలుస్తారు.

కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహాత్మ్యమూ సామాన్యమైనది కాదు! వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు.

ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యా΄పాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణ్వాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం. ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి.

ఈ దేవాలయంలో వెలసిన వేణుగోపాలస్వామి సంతాన వేణు గోపాల స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఎవరైతే ఈ క్షేత్రంలో స్వామి వారిని మనసా వాచా నమ్మి పూజిస్తారో వాళ్ళకి ఆ స్వామివారు మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి. ఈ ఆలయంలో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామికి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలగి పోతుందనీ, శత్రునాశనం జరుగుతందనీ నమ్మకం!

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో మలేసియాన్ టౌన్‌షిప్‌కి వ్యతిరేక దిశలో కొలువైన వేణుగోపాల స్వామి దేవాలయం ఒక గుట్ట పైన వెలసినది. గుట్టపైన స్వామి వారి విగ్రహం దొరకగా అక్కడే గుడి కట్టించారు. ఈ ప్రదేశాన్ని గోవర్ధనగిరి అని పిలుస్తారు.

వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కృష్ణా జిల్లాలోని హంసలదీవిలో ఉంది. అద్భుతమైన శిల్పకళ, చక్కటి కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయం సముద్రపు అటుపోటులను తట్టుకునేలా ప్రాకారాన్ని నిర్మించారు. తూర్పు ముఖాన అద్భుతమైన రాజగోపురం ఉంటుంది.

చెన్నూర్‌లో పూజలందుకుంటున్న అతి పురాతన జగన్నాథ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ప్రవహించే గోదావరిని ఉత్తరవాహిని అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం.

150 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. నెహ్రు జంతు ప్రదర్శన శాలకు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని కిషన్ బాగ్ దేవాలయం అని కూడా అంటారు. నిజాం దగ్గర వకీల్‌గా పని చేసిన రాజా రాం బహుదూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు, రథ యాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో వెలసిన వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారు.