
సాహసం చేయడానికి సై అంటూ కథానాయిక సంయుక్త అడవి బాట పట్టారు. దట్టమైన అడవుల్లో ఆమె ట్రెక్కింగ్‌కి వెళ్లారు. అందులోనూ వర్షం కురుస్తుండగా ధైర్యంగా ఈ సాహస యాత్ర చేశారు సంయుక్త. ఈ సాహస యాత్రకి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారామె. ‘‘దట్టమైన పచ్చని అడవిలో ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ అంటే సాహసమే.
పైగా వర్షం కురుస్తుండగా ట్రెక్కింగ్‌కి వెళ్లడం ఎంతో మధురానుభూతి. ఈ ట్రెక్కింగ్‌లో ఎన్నో చెప్పలేనన్ని సంతోషాలు, థ్రిల్‌కి గురిచేసే అంశాలున్నాయి. ఇలాంటి గొప్ప అనుభవాలు మీకు ఎదురయ్యాయా?’’ అంటూ రాసుకొచ్చారు సంయుక్త. ఇక ఆమె నటిస్తున్న తాజా సినిమాల విషయానికొస్తే... తెలుగులో ‘అఖండ 2, స్వయంభు, నారీ నారీ నడుమ మురారి, విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీ, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్నారు.