
హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కామెడీ మూవీ అన్నారు గానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయింది. ఇప్పుడీ చిత్రం అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఒకేసారి వచ్చింది.
(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు)
నితిన్-శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 సంస్థ.. తాజాగా శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు టీవీలో టెలికాస్ట్ చేసింది. అదే టైంలో ఓటీటీలోకి కూడా తీసుకొచ్చేసింది. గతంలో సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి ఇలానే చేసి మంచి వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్నారు.
రాబిన్ హుడ్ విషయానికొస్తే.. రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) చిన్నప్పుడే దొంగగా మారతాడు. ధనవంతుల నుంచి డబ్బులు దొంగిలించి అనాథ శరణాలయాలకు దానం చేస్తుంటాడు. మరోవైపు రుద్రకొండలో కరుడుగట్టిన విలన్ ఉంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న వాసుదేవ్ కుమార్తె రీనా (శ్రీలీల) తాతని చూసేందుకు ఇండియా వస్తుంది. ఈ మూడు పాత్రలు ఎలా కలిశాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: హీరో జయం రవి భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!)