
డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈయన నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడమ్ (Sir Madam Movie). నిత్యామీనన్ (Nithya Menen) కథానాయికగా యాక్ట్ చేసింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలై 25న రిలీజైంది. సార్ మేడమ్ పేరిట తెలుగులో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఓటీటీలో సార్ మేడమ్
దాదాపు నెల రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సార్ మేడమ్ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
భార్యాభర్తల స్టోరీ
ఈ మూవీలో నిత్యామీనన్- విజయ్ భార్యాభర్తలుగా నటించారు. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. పెళ్లి చేసుకునేవారు, చేసుకున్నవారు ఈ సినిమాను ఓసారి ఓటీటీలో చూడాల్సిందే!
Get ready to fall in love with Aagasaveeran and Perarasi... twice 👀#ThalaivanThalaiviiOnPrime, Aug 22@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini @ActorMuthukumar pic.twitter.com/VqI3bn7zqP
— prime video IN (@PrimeVideoIN) August 15, 2025
చదవండి: పెళ్లిపందిట్లో టాలీవుడ్ హీరో చిరుదరహాసం.. ఆ చూపుల్లోనే..!