
'కేరింత' సినిమాతో వెండితెరపై తళుక్కుమని మెరిశాడు విశ్వంత్ దుద్దుంపూడి (Viswant Duddumpudi). ఓ పిట్ట కథ, క్రేజీ క్రేజీ ఫీలింగ్, తోలు బొమ్మలాట, బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనుక కథ, నమో, హైండ్ అండ్ సీక్ చిత్రాల్లో హీరోగా నటించాడు. జెర్సీ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.
ఆరు నెలల కిందట పెళ్లి
తాజాగా అతడు తన పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు. గతేడాది ఆగస్టులో భావన అనే అమ్మాయితో విశ్వంత్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజునే భావనను పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేశాడు. తన పెళ్లయి ఆరునెలలు అవుతుండటంతో తాజాగా మరోసారి తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన హీరో
భావన & విశ్వంత్.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే చూపులోనే ఓ రకమైన ప్రశాంతత.. నువ్వు నాకెప్పటినుంచో తెలుసన్న భావన.. ఇద్దరి చిరునవ్వులు సహజంగానే కలిసిపోయాయి! అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: రకుల్ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తారలు