breaking news
Sir Madam Movie
-
ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సెంచరీ
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ సేతుపతి- నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన సార్ మేడమ్ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్ మేడమ్ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంచరీ క్లబ్లో మూవీబాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్ మేడమ్ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.సినిమాసార్ మేడమ్ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్, ఆర్కే సురేశ్, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్‌గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్ మేడమ్ సినిమా కథ! Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025 చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్, మా వాళ్లే.. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, మా, మారిషన్, కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)అమెజాన్ ప్రైమ్మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 18సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18ఎక్స్టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) - ఆగస్టు 20డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) - ఆగస్టు 21గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) - ఆగస్టు 21హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) - ఆగస్టు 21ద 355 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 21అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23హాట్స్టార్స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) - ఆగస్టు 22సన్ నెక్స్ట్కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) - ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేవుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్) -
భార్యాభర్తల కొట్లాటే 'సార్ మేడమ్'.. వచ్చేవారమే ఓటీటీలో..
డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈయన నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడమ్ (Sir Madam Movie). నిత్యామీనన్ (Nithya Menen) కథానాయికగా యాక్ట్ చేసింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలై 25న రిలీజైంది. సార్ మేడమ్ పేరిట తెలుగులో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో సార్ మేడమ్దాదాపు నెల రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సార్ మేడమ్ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.భార్యాభర్తల స్టోరీఈ మూవీలో నిత్యామీనన్- విజయ్ భార్యాభర్తలుగా నటించారు. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించారు. పెళ్లి చేసుకునేవారు, చేసుకున్నవారు ఈ సినిమాను ఓసారి ఓటీటీలో చూడాల్సిందే! Get ready to fall in love with Aagasaveeran and Perarasi... twice 👀#ThalaivanThalaiviiOnPrime, Aug 22@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini @ActorMuthukumar pic.twitter.com/VqI3bn7zqP— prime video IN (@PrimeVideoIN) August 15, 2025చదవండి: పెళ్లిపందిట్లో టాలీవుడ్ హీరో చిరుదరహాసం.. ఆ చూపుల్లోనే..! -
సార్.. మేడమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిత్యామీనన్.. (ఫోటోలు)
-
తెలుగు ట్రాన్స్ లేటర్‌గా నిత్యామీనన్.. స్టేజీపై నవ్వులే నవ్వులు!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సార్ మేడమ్'. రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్య, భర్తలుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ సేతుపతితో పాటు నిత్యామీనన్, డైరెక్టర్ పాండిరాజ్ కూడా హాజరయ్యారు.(ఇది చదవండి: 'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!)ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలుగు ట్రాన్స్‌లేట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. డైరెక్టర్ పాండిరాజ్ తమిళంలో మాట్లాడగా.. ఆ వ్యాఖ్యలను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసింది. 'సార్ మేడమ్ సినిమా చాలా మంచి లవ్ స్టోరీ.. భార్య, భర్తల మధ్య జరిగే గొడవ.. కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ చాలా బాగా నటించారు.. వీళ్ల కన్నా బెటర్‌గా ఎవరూ చేయలేరు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్' అంటూ డైరెక్టర్ పాండిరాజ్ మాటలకు ట్రాన్స్‌లేటర్‌గా నిత్యామీనన్ అందరికీ నవ్వులు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు. -
'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవసే ఏస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరోసారి.. డిఫరెంట్ రోల్‌తో అలరించనున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం సార్ మేడమ్. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈనెల 25 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా సార్ మేడమ్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్యభర్తలుగా నటించారు. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా తెరపై చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు.