
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సార్ మేడమ్'. రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్య, భర్తలుగా నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ సేతుపతితో పాటు నిత్యామీనన్, డైరెక్టర్ పాండిరాజ్ కూడా హాజరయ్యారు.
(ఇది చదవండి: 'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!)
ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలుగు ట్రాన్స్‌లేట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. డైరెక్టర్ పాండిరాజ్ తమిళంలో మాట్లాడగా.. ఆ వ్యాఖ్యలను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసింది. 'సార్ మేడమ్ సినిమా చాలా మంచి లవ్ స్టోరీ.. భార్య, భర్తల మధ్య జరిగే గొడవ.. కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ చాలా బాగా నటించారు.. వీళ్ల కన్నా బెటర్గా ఎవరూ చేయలేరు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్' అంటూ డైరెక్టర్ పాండిరాజ్ మాటలకు ట్రాన్స్లేటర్గా నిత్యామీనన్ అందరికీ నవ్వులు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు.