
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవసే ఏస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరోసారి.. డిఫరెంట్ రోల్‌తో అలరించనున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం సార్ మేడమ్. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈనెల 25 థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా సార్ మేడమ్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్యభర్తలుగా నటించారు. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా తెరపై చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్గా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు.