
థియేటర్‌లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ సేతుపతి- నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన సార్ మేడమ్ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్ మేడమ్ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సెంచరీ క్లబ్‌లో మూవీ
బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్ మేడమ్ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.
సినిమా
సార్ మేడమ్ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్, ఆర్కే సురేశ్, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్‌గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్ మేడమ్ సినిమా కథ!
Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL
— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025
చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్, మా వాళ్లే..