
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) ప్రెసిడెంట్‌గా తొలిసారి ఒక మహిళ ఎన్నికయ్యారు. నటుడు, బీజేపీ నాయకుడు దేవన్‌తో గట్టి పోటీ ఎదుర్కొని ఆమె గెలుపొందారు. దీంతో మలయాళ చిత్రపరిశ్రమలో తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా నటి శ్వేతా మీనన్‌ను రికార్డ్ క్రియేట్ చేశారు. శ్వేతతో పాటు, నటి కుక్కు పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు, నటి అన్సిబా హసన్ జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి తిరిగి వచ్చారు. వీరిలో ముగ్గురు మహిళలు కీలక నాయకత్వ పాత్రల్లో ఉన్నారు. అదనంగా, జయన్ చెర్తాల, లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక విడుదలైన తర్వాత ‘అమ్మ’ అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ఎంపిక కావడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ (Hema Committee report) తేల్చింది. దీంతో దీంతో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ సంఘానికి అధ్యక్షుడిగా మోహన్‌లాల్ (Mohanlal) గతేడాదిలోనే రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి కూడా పదవుల నుంచి వైదొలిగింది. దీంతో మళ్లీ ఎన్నికలు జరిగాయి. తన విజయం తర్వాత శ్వేతా మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి వంటి స్టార్స్ మద్ధతు తనకు చాలా అవసరమని ఆమె ఆశించారు.

అశ్లీల సినిమాలో నటించారని ఎన్నికల ముందు కేసు నమోదు
శ్వేతా మీనన్ ఎన్నికలకు ముందే ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. అశ్లీల కంటెంట్‌లో నటించిందనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటింటిన శ్వేతా మీనన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె దాదాపు ఓడిపోతారని అందరూ అనుకున్నారు. అయితే, గెలిచి సత్తా చాటారు.
కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్‌లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్‌లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్‌విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది.