ఇదే లాస్ట్‌ వార్నింగ్‌.. కాస్త హద్దుల్లో ఉండండి: హీరోయిన్‌ | Malayali Actress Mahima nambiyar warning to youtubers | Sakshi
Sakshi News home page

ఇదే లాస్ట్‌ వార్నింగ్‌.. కాస్త హద్దుల్లో ఉండండి: హీరోయిన్‌

Sep 30 2025 7:09 AM | Updated on Sep 30 2025 7:09 AM

Malayali Actress Mahima nambiyar warning to youtubers

గత 15 ఏళ్లగా హీరోయిన్‌గా రాణిస్తున్న మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్‌. మాతృభాషలోనే కాకుండా తమిళంలోనూ పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్‌లోకి కూడా వచ్చేస్తుంది.  శ్రీవిష్ణుతో కలిసి ఓ  సినిమాలో నటిస్తోంది.కోన వెంకట్ సమర్పణలో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆమె చంద్రముఖి2, విజయ్‌ ఆంటోని (రక్తం) మూవీలో ఆమె నటించారు. సుమారు 50కి పైగా మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన నంబియార్‌ సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. కథ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా ఎంతమాత్రం తగ్గరనే పేరు ఉంది.

దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ ఈమెను పెద్దఎత్తున ట్రోల్‌ చేస్తున్నాయి. అదే ఇప్పుడు ఈమెకు కోపాన్ని రేకెత్తిస్తోంది. దీంతో మహిమా నంబియార్‌ యూట్యూబ్‌ ఛానల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీని గురించి ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఇటీవల కాలంలో తన గురించి కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయన్నారు. అలాంటి వదంతులను ఇప్పటి వరకూ సహిస్తూ వచ్చానని, ఇకపై సహించేది లేదని చట్టపరమైన చర్చలు తీసుకుంటానని పేర్కొన్నారు. 

ఇంత కాలం తన గురించి జరుగుతున్న వదంతులను శాంతంగా సహిస్తూ వచ్చానని, ఇకపై అలా ఉండదని, తాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అదే విధంగా తన వ్యక్తగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. ఒక వేళ ఎవరైనా హద్దులు దాటి తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్చలు తీసుకుంటాననీ, ఇదే తన చివరి హెచ్చరిక అంటూ నటి మహిమా నంబియార్‌ పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూడు పదుల అమ్మడు  అంతగా హర్ట్‌ అయిన ప్రచారం ఏమిటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement