Dude OTT App Logo Launched Today - Sakshi
Sakshi News home page

Dude OTT App: త్వరలో మరో కొత్త ఓటీటీ యాప్‌.. లైవ్‌ న్యూస్‌తో సహా సేవలు

Apr 25 2022 8:17 AM | Updated on Apr 25 2022 11:25 AM

Dude OTT App Logo Launched - Sakshi

కరోనా లాక్‌డౌన్‌తో డిజిటల్‌ ప్లాట్‌ఫాంలకు ఆదరణ చాలా బాగా పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీ బాట పట్టాయి. సినిమాల విడుదలకు ఓటీటీలే అడ్రస్‌గా మారాయి.

Dude OTT App Logo Launched: కరోనా లాక్‌డౌన్‌తో డిజిటల్‌ ప్లాట్‌ఫాంలకు ఆదరణ చాలా బాగా పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీ బాట పట్టాయి. సినిమాల విడుదలకు ఓటీటీలే అడ్రస్‌గా మారాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వచ్చి.. థియేటర్లు తెరుచుకున్న కూడా ఓటీటీల హవా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు సొంతంగా ఓటీటీ యాప్‌ను ప్రారంభించారు. 

తాజాగా మరో ఓటీటీ యాప్‌ రానుంది.. ‘డ్యూడ్‌’ అనే సరికొత్త ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. మే 1 నుంచి ‘డ్యూడ్‌’ ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ‘డ్యూడ్‌’ లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘డ్యూడ్‌’ ఓటీటీ వ్యవస్థాపకుడు, దర్శక-నిర్మాత ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతిభావంతులకు సరైన మార్గాన్ని ఏర్పరచాలనే ధృడ సంకల్పంతో నేను, ధూళిపూడి ‘డ్యూడ్‌’కి నాంది పలికాం. ఇందులో సినిమా, వెబ్‌సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్‌ న్యూస్‌.. ఇలా ఎన్నో ఉంటాయి.’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్, స్పాన్సర్లు సద్గురు, సమై శేఖర్, హీరోయిన్స్‌ డోరిస్, హరిత పాల్గొన్నారు.  

చదవండి: కొత్త బిజినెస్‌ను ప్రకటించిన షారుక్‌ ఖాన్‌



Advertisement
 
Advertisement
Advertisement